Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: టీడీపీ యువనేత, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేపట్టనున్నారు. వచ్చే జనవరి 27 నుంచి లోకేశ్ పాదయాత్ర మొదలుకానుంది. కుప్పం నుంచి ఇచ్ఛాపురం వరకు సుదీర్ఘంగా కొనసాగనున్న ఈ పాదయాత్రపై తనను కలిసిన నేతలకు లోకేశ్ స్పష్టతనిచ్చారు. పాదయాత్రకు మధ్యలో ఎక్కడా విరామం ఉండదని, ప్రజా సమస్యలను తెలుసుకుంటూ, ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తూ యువతను ఆకట్టుకునే దిశగా పాదయాత్ర కొనసాగనున్నట్లు తెలుస్తుంది. పాదయాత్రకు సంబంధించిన విధివిధానాలన్నింటినీ ఈ నెలాఖరు నుంచి ఫైనలైజ్ చేసే అవకాశం ఉంది. దీనిపై మరిన్ని విషయిలు తెలవాల్సి ఉంది.