Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: గత కొన్ని రోజుల నుండి నిజాం కాలేజీ విద్యార్థులు చేస్తున్న ఆందోళన తెలిసిందే. అ వైపుగా తెలంగాణ ప్రభుత్వం సమస్యలు పరిష్కరించింది. ఈ మేరకు తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ట్వీట్ లో గత కొద్దిరోజులుగా ఆందోళన చేస్తున్న నిజాం కళాశాల డిగ్రీ విద్యార్థుల సమస్యను మానవతా దృక్పథంతో ప్రభుత్వం పరష్కరించిందన్నారు. గతంలో ఎప్పుడు లేని విధంగా చరిత్రలోనే మొదటిసారిగా ముఖ్యమంత్రి ఆదేశాలకు అనుగుణంగా విద్యార్థినులకు నిజాం కళాశాలలో హాస్టల్ వసతి కల్పించడం జరిగిందని వెల్లడించారు. ఈ తరుణంలో తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటనతో విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.