Authorization
Mon Jan 19, 2015 06:51 pm
లక్నో: ఒక కారులో రూ.2 కోట్లకు పైగా నగదును పోలీసులు గుర్తించారు. హవాలా డబ్బుగా అనుమానించి స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించి 8 మంది అరెస్ట్ చేశారు. ఉత్తరప్రదేశ్ నోయిడాలో ఈ సంఘటన జరిగింది. నోయిడాలోని సెక్టార్ 55 ప్రాంతంలో హవాలా వ్యాపారం జరుగుతున్నట్లు సెక్టార్ 58 పోలీస్ స్టేషన్‌కు గురువారం సాయంత్రం సమాచారం అందింది. ఈ నేపథ్యంలో కొంత మంది వ్యక్తుల వద్ద కోట్లలో డబ్బులు ఉన్నట్లు తెలిసింది. దీంతో సెక్టార్ 58 పోలీసులు ఈ సమాచారాన్ని సెక్టార్ 55 పోలీస్ స్టేషన్‌కు అందజేశారు.
కాగా, రంగంలోకి దిగిన సెక్టార్ 55 పోలీసులు ఒక కారును గుర్తించి సోదా చేశారు. అందులో ఉన్న రూ.2 కోట్లకు పైగా డబ్బును స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించి 8 మందిని అరెస్ట్ చేశారు. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌కు చెందిన జయంతి భాయ్, ఢిల్లీకి చెందిన సందీప్ శర్మ, వినయ్ కుమార్, విపుల్, పశ్చిమ బెంగాల్‌కు చెందిన అభిజీత్ హజ్రా, నోయిడా సెక్టార్ 56కు చెందిన రోహిత్ జైన్, ముంబైకి చెందిన మినేష్ షా, ఇండోర్‌కు చెందిన అనూజ్‌ను నిందితులుగా గుర్తించారు. మరోవైపు ఈ సమాచారం అందుకున్న ఆదాయపు పన్ను శాఖ అధికారులు కూడా సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కారు నుంచి స్వాధీనం చేసుకున్న డబ్బు హవాలా నెట్‌వర్క్‌కు చెందినదిగా భావిస్తున్నారు. ఈ డబ్బు గురించి, మరి కొంత మంది వ్యక్తుల ప్రమేయంపై దర్యాప్తు చేపడతామని అధికారులు తెలిపారు.