Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తిరువనంతపురం: విమానం గాల్లో ఉండగా అందులో ప్రయాణిస్తున్న ఆర్మీకి చెందిన జవాన్ గుండెపోటుతో తన సీటులో కుప్పకూలాడు. కేరళలోని కోజికోడ్ నుంచి ఢిల్లీ వెళ్తున్న విమానంలో ఆదివారం ఈ సంఘటన జరిగింది. ఫ్లైట్ సిబ్బంది ప్రకటనతో అప్రమత్తమైన ఒక నర్సు వెంటనే స్పందించింది. ఆ జవాన్‌కు సీపీఆర్ నిర్వహించి ఆయన ప్రాణాలు కాపాడింది. ఆర్మీకి చెందిన 32 ఏళ్ల సుమన్ డ్యూటీలో జాయిన్ అయ్యేందుకు విమానంలో ఢిల్లీకి వెళ్తున్నాడు. ఆ విమానం గాల్లో ఉండగా ఆయనకు గుండెపోటు వచ్చింది. దీంతో కూర్చొన్న సీటులోనే కుప్పకూలిపోయాడు. గమనించిన తోటి ప్రయాణికులు విమాన సిబ్బందిని అలెర్ట్ చేయగా ఆ జవాన్‌ను పరిశీలించిన సిబ్బంది ఆయనకు బీపీ, పల్స్ లేకపోవడంతో ఎమర్జెన్సీగా ప్రకటించారు. విమానంలో డాక్టర్ లేదా నర్సు ఎవరైనా ఉన్నారా అని అనౌన్స్‌మెంట్ చేయగా గీత అనే నర్సు ఆ విమానంలో ప్రయాణిన్నారు. 2020 నేషనల్ ఫ్లోరెన్స్ నైటింగేల్ అవార్డును రాష్ట్రపతి చేతులమీదుగా అందుకునేందుకు ఆమె ఢిల్లీ వెళ్తున్నారు. విమాన సిబ్బంది అనౌన్స్‌మెంట్ విన్న నర్సు గీత వెంటనే స్పందించారు. ఆర్మీ జవాన్ సుమన్‌కు సీపీఆర్ ప్రక్రియ నిర్వహించారు. అందుబాటులో ఉన్న అత్యవసర మందులతో చికిత్స అందించగా నర్సు గీతా తన సేవలతో జవాన్ ప్రాణాలు కాపాడారు. విమానంలో ప్రయాణిస్తున్న డబ్ల్యూహెచ్‌వోకు చెందిన డాక్టర్ మహ్మద్ అషీల్ కూడా తన వంతు సహకారం అందించగంతో జవాన్ కోలుకున్నాడు.