Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: ప్రముఖ టీవీ నటుడు సిద్ధాంత్ వీర్ సూర్యవంశీ శుక్రవారం మరణించారు.46 ఏండ్ల సిద్ధాంత్ సూర్యవంశీ జిమ్‌లో వర్కవుట్లు చేస్తుండగా కుప్పకూలారు. ఆయనను హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా, కాపాడేందుకు వైద్యులు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. గుండెపోటుతో సిద్ధాంత్ జిమ్‌లో కుప్పకూలారని చెబుతున్నారు. రాజు శ్రీవాస్తవ, దీపేష్ భాన్ తర్వాత ఎక్సర్‌సైజ్ చేస్తూ మరణించిన మూడో సెలెబ్రిటీ సిద్ధాంత్ సూర్యవంశీ కావడం గమనార్హం. సిద్ధాంత్ మరణం పట్ల జే భానుశాలి, సలీల్ అంకోల సహా పలువురు టీవీ సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా సంతాపం వ్యక్తం చేశారు. ఆనంద్‌గా పేరొందిన నటుడు ఇటీవల తన పేరును సిద్ధాంత్ వీర్ సూర్యవంశీగా మార్చుకున్నారు. సిద్ధాంత్‌కు భార్య, ఇద్దరు పిల్లలున్నారు. కంట్రోల్ రూం, జిద్ది దిల్ మానేనా, క్యో రిస్ఓన మే కట్టి బట్టి వంటి టీవీషోల్లో సిద్ధాంత్ కనిపించారు. కుసుమ్, కసౌటి జిందగి కే, మమత, కృష్ణార్జున్, భాగ్యవిధాత, విరుధ్, సూర్యపుత్ర కర్ణ్, వారిస్ వంటి టీవీ షోల్లో ఆయన నటన ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక సిద్ధాంత్ వీర్ సూర్యవంశి మోడల్ అలేసియ రౌత్‌ను వివాహం చేసుకున్నారు.