Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పెద్దపల్లి: ప్రధాని మోడీ రేపు రాష్ట్రానికి రాక సందర్భంగా అఖిలభారత న్యాయవాదుల సంఘం(ఐలు), భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) లీగల్ సెల్ ఆధ్వర్యంలో ఖని మున్సిఫ్ కోర్టు కాంప్లెక్స్ వద్ద న్యాయవాదులు నిరసన చేపట్టారు. న్యాయవాదులకు వృత్తిపరంగా ఇబ్బందులకు గురిచేస్తున్న 41 ఏ ను రద్దు చేయాలని, విదేశీ న్యాయ వాదులను భారత్‌లోకి అనుమతించరాదని డిమాండ్ చేస్తూ ప్రదర్శన నిర్వహించారు.
ఈ సందర్భంగా ఐలు జాతీయ కౌన్సిల్ సభ్యురాలు చందాల శైలజ, బీఆర్ఎస్ లీగల్ సెల్ బాధ్యులు జవ్వాజి శ్రీనివాసు మాట్లాడారు. సింగరేణి సంస్థను ప్రైవేటీకరించవద్దని, రాజీవ్ రహదారిని ఆరు లైన్లుగా మార్చి జాతీయ రహదారిగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. రామగుండం నుంచి మణుగూరు వరకు రైల్వేలైను ఏర్పాటు చేయాలని, సింగరేణి ఆర్ఎఫ్ సీఎల్, ఎన్టీపీసీలోని ప్రైవేటు కార్మికులను వెంటనే పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు.న్యాయవాదులు గోషిక ప్రకాష్, ఎరుకల ప్రదీప్ కుమార్, మురళి, నూతి సురేష్ కుమార్ పాల్గొన్నారు.