Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చెన్నై: ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజాకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ శుక్రవారం గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి, ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తదితరులు పాల్గొన్నారు. దిండిగల్‌లోని గాంధీగ్రామ్ రూరల్ ఇన్‌స్టిట్యూట్ 36వ స్నాతకోత్సవంలో మోడీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇళయరాజాకు గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేశారు. గాంధీగ్రామ్‌లో తనకు స్వాగతం పలికిన ప్రజలందరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు. స్నాతకోత్సవంలో మోడీ మాట్లాడుతూ, గాంధీగ్రామ్‌ను స్వయంగా మహాత్మా గాంధీయే ప్రారంభించారని తెలిపారు. గ్రామీణాభివృద్ధి గురించి గాంధీ ఆలోచనల స్ఫూర్తిని ఇక్కడ చూడవచ్చునని తెలిపారు. గాంధీ చెప్పిన విలువల ఔన్నత్యం పెరుగుతోందని చెప్పారు. ఘర్షణలకు ముగింపు పలకడం కోసమైనా, వాతావరణ సంక్షోభం విషయంలోనైనా గాంధీ చెప్పిన విలువలు ఇప్పటికీ ఆచరణ యోగ్యమైనవేనని తెలిపారు.