Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబై: మహారాష్ట్రలో ముంబైకి చెందిన డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు అక్రమంగా మాదకద్రవ్యాలు తరలిస్తున్న ఓ నిందితుడి ఆటకట్టించారు. నైరోబి నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడి తీరు అనుమానాస్పదంగా కనిపించడంతో.. ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయంలో డీఆర్ఐ అధికారులు అడ్డుకున్నారు. నిందితుడి లగేజీని తనిఖీ చేయగా అతని దగ్గర 4.98 కిలోల హెరాయిన్ లభ్యమైంది. దాంతో అధికారులు నిందితుడిని అదుపులోకి తీసుకుని, హెరాయిన్‌ను సీజ్ చేశారు. సీజ్ చేసిన హెరాయిన్ విలువ అంతర్జాతీయ మార్కెట్‌లో దాదాపు రూ.35 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేశారు.