Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: వరల్డ్ కప్ టైటిల్ ఫేవరెట్లలో ఒకటైన టీమిండియా సెమీస్ లో ఓడిపోవడం కొంత బాధాకరం. దీనిపై భారత క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ స్పందించారు. టీమిండియా ఆటగాళ్లను ఇకపై కీలక దశలో చేతులెత్తేసే వాళ్లు అని పిలవొచ్చని వ్యాఖ్యానించారు. వాళ్లను అలా పిలవడంలో తప్పులేదని, సెమీస్ వరకు దూసుకొచ్చి, సెమీస్ లో నీరుగారిపోయారని మండిపడ్దారు. భారత ఆటగాళ్లపై అంతకుమించి తీవ్ర పదజాలం ఉపయోగించలేనని, అభిమానులు కూడా భారత జట్టుపై దూషణలకు పాల్పడరాదని కపిల్ దేవ్ సూచించారు. సెమీస్ లో టీమిండియా చెత్తగా ఆడిందని, కాకపోతే ఒక్క మ్యాచ్ తో వారిని తీవ్రస్థాయిలో నిందించడం తగదని పేర్కొన్నారు. సెమీస్ లో పరిస్థితులను టీమిండియా కంటే ఇంగ్లాండ్ మెరుగ్గా ఉపయోగించుకుందని అభిప్రాయపడ్డారు.