Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: టీ 20 వరల్డ్ కప్‌లో సూపర్ 12 గ్రూప్ మ్యాచుల్లో అదరగొట్టిన భారత జట్టు సెమీఫైనల్లో దారుణంగా ఓడిపోయింది. దాంతో, న్యూజిలాండ్ పర్యటనకు ప్రధాన కోచ్ రాహుల్ ద్రావిడ్‌తో పాటు సపోర్టింగ్ స్టాఫ్‌కు బీసీసీఐ విశ్రాంతినిచ్చింది. ద్రావిడ్ స్థానంలో నేషనల్ అకాడమీ హెడ్‌గా ఉన్న వీవీఎస్ లక్ష్మణ్‌కి తాత్కాలికంగా కోచ్ బాధ్యతలు అప్పగించింది. బ్యాటింగ్ కోచ్‌గా హృషిలేష్ కనిట్కర్, బౌలింగ్ కోచ్‌గా సాయిరాజ్ బహుతులే నియమితులయ్యారు. నవంబర్ 18వ తేదీన న్యూజిలాండ్ సిరీస్ మొదలుకానుంది. ఈ సిరీస్‌లో భారత జట్టు, ఆతిథ్య న్యూజిలాండ్‌తో మూడు టీ 20లు, ఆరు వన్డేలు ఆడనుంది. టీ20 జట్టుకు హార్ధిక్ పాండ్యా, వన్డేజట్టుకు శిఖర్ ధావన్ నాయకత్వం వహించనున్నారు.
న్యూజిలాండ్ టూర్‌కి రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్.రాహుల్, రవిచంద్రన్ అశ్విన్ వంటి సీనియర్ ఆటగాళ్లకు విశ్రాంతినిచ్చారు. వీళ్లు డిసెంబర్‌లో బంగ్లాదేశ్ పర్యటనకు వెళ్లే టీమ్‌తో జాయిన్ అవుతారని బీసీసీఐ అధికారులు చెప్పారు.