Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: సికింద్రాబాద్, హైదరాబాద్ సబర్బన్‌కు సంబంధించి ఎంఎంటీఎస్ లోకల్ రైలు సర్వీసులను శని, ఆదివారాల్లో రద్దు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. సనత్‌నగర్-హఫీజ్‌పేట్ స్టేషన్ల మధ్య కొనసాగుతున్న ట్రాక్‌ల నిర్వహణ పనుల నేపథ్యంలో ఆ మార్గంలో నడువాల్సిన 18 ఎంఎంటీఎస్ రైళ్లను ఈ నెల 12, 13 తేదీలలో రద్దు చేసినట్లు శుక్రవారం ఎస్‌సీఆర్ అధికారులు తెలిపారు. ఇందులో ఈ నెల 12న పన్నెండు రైళ్లు, ఈ నెల 13న ఆరు రైళ్లు రద్దు చేసినట్లు అధికారులు వెల్లడించారు.