Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మధ్యాహ్న భోజనం వికటించి 42 మంది విద్యార్థుల అస్వస్థత
పరిశీలించిన డి ఏం హెచ్ ఓ సుదర్శన్
నవతెలంగాణ- నవీపేట్: విద్యార్థులకు నాణ్యమైన బియ్యాన్ని పంపిణీ చేయాల్సింది పోయి జాలి కట్టిన బియ్యం పంపిణీ చేయడంతో 42 మంది విద్యార్థులు అస్వస్థకు గురయ్యారు. మండల కేంద్రంలోని బాలుర పాఠశాలలో మధ్యాహ్నం బియ్యం అయిపోవడంతో ఎండిఎం కార్మికుడు స్థానిక మోడల్ పాఠశాల నుండి బియ్యం తెప్పించుకొని వంట చేయగా మధ్యాహ్నం మూడు గంటల తర్వాత విద్యార్థులు ఒకరి తర్వాత ఒకరు వాంతులు చేసుకోవడంతో స్థానిక ప్రభుత్వాసుపత్రికి చికిత్స నిమిత్తం తీసుకెళ్లారు. సమాచారం మేరకు డిఎంహెచ్వో సుదర్శన్ సంఘటన స్థలానికి వచ్చి విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని పరిశీలించారు. కడుపునొప్పి, తలనొప్పితో విద్యార్థులు బాధపడుతుండగా ప్రథమ చికిత్స చేయగా 36 మంది విద్యార్థులు సాధారణ స్థితిలో ఉన్నారని ఆరుగురు మూడు, నాలుగు సార్లు వాంతులు చేసుకోవడంతో మెరుగైన చికిత్స చేస్తున్నమని విద్యార్థుల పరిస్థితి అదుపులోనే ఉందని తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. అనంతరం పాఠశాలకు వెళ్లి పరిశీలించగా జాలి కట్టిన బియ్యం ఉన్నాయి. అలాగే గత పది రోజుల నుండి విద్యార్థులు వాటర్ ట్యాంక్ నీళ్లే తాగుతుండడంతో నీళ్లతో పాటు బియ్యం, వంటకు ఉపయోగించిన సామాగ్రిని జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు పరీక్షల నిమిత్తం తీసుకెళ్తున్నట్లు తెలిపారు. ఆయన వెంట తహసిల్దార్ వీర్ సింగ్, ప్రధానోపాధ్యాయురాలు అనురాధ, రెవెన్యూ సిబ్బంది మరియు ఉపాధ్యాయులు ఉన్నారు.