Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అమరావతి: ప్రధాని నరేంద్ర మోడీ తమిళనాడు పర్యటన ముగించుకుని ఏపీ పర్యటనకు విచ్చేశారు. ఆయన ప్రయాణిస్తున్న విమానం వర్షం వల్ల మధురై నుంచి విశాఖకు ఆలస్యంగా చేరుకుంది. ఎయిర్ పోర్టు నుంచి ప్రధాని మోడీ ఐఎన్ఎస్ డేగాకు పయనమయ్యారు. తూర్పుతీర నౌకాదళ స్థావరంలో ప్రధాని మోడీకి ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, సీఎం జగన్ స్వాగతం పలికారు. అనంతరం ప్రధాని మోడీ బీజేపీ ఏర్పాటు చేసిన భారీ రోడ్ షోకు పయనమయ్యారు. అటు, జనసేనాని పవన్ కల్యాణ్ హోటల్ నోవోటెల్ నుంచి ప్రధాని మోడీతో సమావేశం కోసం చోళ సూట్ కు బయల్దేరారు.