Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : ప్రధాని నరేంద్రమోడీ శనివారం రాష్ట్ర పర్యటనకు రానున్నారు. రామగుండం ఎరువుల ఫ్యాక్టరీతోపాటు రూ.9500 కోట్ల విలువైన జాతీయ రహదారులు, రైల్వే ప్రాజెక్టులను ఈ సందర్భంగా జాతికి అంకితం చేయనున్నారు. మొత్తంగా ఆరు గంటలపాటు రాష్ట్రంలో ప్రధాని పర్యటన కొనసాగనుంది. శుక్రవారం ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వచ్చిన మోడీ.. శనివారం విజయవాడ నుంచి బయలుదేరి మధ్యాహ్నం 1.30 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకోనున్నారు. ఈ సందర్భంగా విమానాశ్రయం ఆవరణలో బీజేపీ నగరశాఖ తరఫున స్వాగత సభ ఏర్పాటు చేశారు. ఈ వేదిక నుంచి పార్టీ కార్యకర్తలనుద్దేశించి మోడీ ప్రసంగిస్తారు. అనంతరం మధ్యాహ్నం 2.15 గంటలకు బేగంపేట నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో బయలుదేరి 3.20 గంటలకు రామగుండం చేరుకుంటారు. అక్కడి నుంచి 3:30 గంటలకు రోడ్డు మార్గంలో రామగుండం ఫర్టిలైజర్స్ కెమికల్స్ లిమిటెడ్ (ఆర్‌ఎ్‌ఫసీఎల్)కు చేరుకుని, రూ.6338 కోట్ల వ్యయంతో పునరుద్ధరించిన ప్లాంట్‌ను ప్రారంభించి జాతికి అంకితం చేస్తారు. అరగంటపాటు ఫ్యాక్టరీని సందర్శిస్తారు. అనంతరం సాయంత్రం 4:15 గంటలకు ఎన్టీపీసీ స్టేడియంలో ఏర్పాటు చేసిన సభా ప్రాంగణానికి చేరుకుంటారు. రూ.2,200 కోట్లతో చేపట్టనున్న మెదక్-సిద్దిపేట-ఎల్కతుర్తి జాతీయ రహదారి, బోధన్-బాసర-భైంసా రహదారి, సిరొంచా-మహదేవ్‌పూర్ రహదారులకు వీడియో లింక్ ద్వారా ప్రధాని శంకుస్థాపన చేయనున్నారు. దీంతోపాటు భద్రాచలం రోడ్డు నుంచి సత్తుపల్లి వరకు రూ.1000 కోట్లతో నిర్మించిన నిర్మించిన రైల్వేలైన్‌ను ప్రారంభించి, బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. ఆ తర్వాత సాయంత్రం 5:30 గంటలకు హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణమవుతారు. 6.30 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకొని.. అక్కడి నుంచి 6.40గంటలకు ప్రత్యేక విమానంలో తిరిగి ఢిల్లీ వెళతారు.