Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : తమ కుమారుడిని హత్య చేసిన నిందితుడిని మట్టుబెట్టేందుకు రెండేళ్లుగా వేచి చూసిన బాధిత తల్లిదండ్రులు చివరకు ప్రతీకార హత్యకు పాల్పడ్డారు. సంచలనం సృష్టించిన ఈ ఘటన సంగారెడ్డి జిల్లాలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. జిల్లాలోని మునిపల్లి మండలం చిన్న చెల్మెడకు చెందిన బేగరి ఆనంద్.. అదే గ్రామానికి చెందిన తలారి ప్రవీణ్‌ను 2020లో దారుణంగా హత్య చేశాడు. పేకాడుతుండగా ఇద్దరి మధ్య మాటామాటా పెరగడంతో అది గొడవకు దారితీసింది. ఆపై ఆగ్రహం పట్టలేని ఆనంద్.. ప్రవీణ్‌ను హత్య చేశాడు. ఈ ఘటనలో జైలుకెళ్లిన ఆనంద్ ఇటీవల బెయిలుపై తిరిగొచ్చాడు. సంగారెడ్డిలో ఉంటూ ఓ ప్రైయివేటు ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాడు. ఈ నెల 9న బంధువుల ఇంట్లో శుభకార్యం కోసమని చిన్న చెల్మెడ గ్రామానికి వెళ్లాడు. నిన్న ఉదయం ఇంట్లో నుంచి బయటకు వచ్చిన ఆనంద్‌ను చూసిన ప్రవీణ్ తండ్రి అంబయ్య, తల్లి స్వరూప, సోదరుడు ప్రభుదాస్ కోపంతో రగిలిపోయారు. గొడ్డళ్లతో అతడిని వెంబడించారు. గ్రామంలోని చౌరస్తా వద్ద ఆనంద్ కళ్లలో కారం కొట్టి పట్టుకున్నారు. అనంతరం తల, చేతులు నరికేసి దారుణంగా హత్య చేశారు. తర్వాత నిందితులు నేరుగా బుధేరా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.