Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : హిమాచల్ ప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్కు రంగం సిద్ధమైంది. ఇవాళ ఆ రాష్ట్రంలోని 68 నియోజకవర్గాలకు ఓటింగ్ నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం విస్తృత ఏర్పాట్లు చేసింది. ఉదయం 8 గంటలకు పోలింగ్ ప్రారంభం కానుండటంతో ఇప్పటికే ఎన్నికల సిబ్బంది, పోలీసు బలగాలు ఆయా పోలింగ్ స్టేషన్లకు చేరుకున్నారు. ఈ ఎన్నికల్లో నువ్వా నేనా అన్నట్టుగా అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రచారాన్ని హోరెత్తించాయి. రాష్ట్రంలోని మొత్తం ఓటర్లు 55,07,261 ఉండగా.. పురుష ఓటర్లు- 27,80,208, మహిళా ఓటర్లు 22,27,016, రాష్ట్రంలో తొలిసారి ఓటు వేయబోయే యువ ఓటర్లు- 1,86,681 ఉన్నారు. మొత్తం పోలింగ్ కేంద్రాలు- 7,881 ఉన్నాయి. ఓటింగ్ జరిగేటప్పుడు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాట్లు చేశారు.