Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : మోడీ పర్యటన వ్యతిరేకంగా శాంతియుతంగా నిరసన చేయాలని సిపిఐ(ఎం) రాష్ట్ర కమిటీ పిలుపు నిచ్చిన నేపథ్యంలో ఖమ్మం జిల్లాలో సీపీఐ(ఎం) నాయకులను పోలీసులు అక్రమంగా అరెస్టులు చేశారు. చింతకాని సీపీఐ(ఎం) మండల పార్టీ కార్యదర్శి మడిపల్లి గోపాలరావు తోపాటు మండల నాయకులను చింతకాని పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు ఈ సందర్భంగా మండల కార్యదర్శి గోపాలరావు మాట్లాడుతూ అక్రమ అరెస్టులతో భయపడేది లేదని అన్నారు ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణ కోసం కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాల నిరసిస్తూ శాంతియుతంగా మోడీ గోబ్యాక్ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించడానికి సీపీఐ(ఎం) పిలుపునిస్తే అక్రమంగా అరెస్టులు చేయడం ప్రజల గొంతును నొక్కి వేయడమేనని అన్నారు. అరెస్టు చేసిన వారిలో మండల కమిటీ సభ్యులు గడ్డం రమణ, దేశబోయిన ఉపేందర్, సీపీఐ(ఎం) నాయకులు గడ్డం కోటేశ్వరరావు , కొంపల్లి శ్రీను, సూత్రపు గంగాధర్ తదితరులు ఉన్నారు.
వైరాలో సీపీఐ(ఎం) నాయకుల అక్రమ అరెస్ట్
వైరాలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు, వైరా అసెంబ్లీ ఇన్చార్జి భూక్యా వీరభద్రం సీపీఐ(ఎం) వైరా రూరల్ మండల కార్యదర్శి తోట నాగేశ్వరావు లను అక్రమంగా వైరా పోలీసులు అరెస్ట్ చేశారు.