Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో 331 బస్తి దవాఖానలు పనిచేస్తున్నాయి. వీటిని 500 కు పెంచాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారని ప్రకటించారు మంత్రి హరీశ్ రావు. హైదరాబాద్ డైరెక్టర్ ఆఫ్ హెల్త్ కార్యాలయంలో పిహెచ్ సి హబ్ ను ప్రారభించారు మంత్రి హరీష్ రావు. హైదరాబాద్ నుంచి జిల్లాలోని మారుమూల గ్రామాల్లో ఉన్న పిహెచ్సి వైద్యులు, రోగులతో వీడియో కాల్ ద్వారా మాట్లాడారు మంత్రి హరీష్ రావు. అనంతరం హరీశ్ రావు మాట్లాడుతూ వైద్యులు, వైద్య సిబ్బందిశిక్షణా కార్యక్రమాలకు పిహెచ్సి హబ్ ఎంతో ఉపయోగపడుతుందని రాష్ట్రంలోని 887 పిహెచ్సీల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసాం. వాటి ద్వారా వీడియో కాల్స్ ద్వారా వివరాలు తెలుసుకోవచ్చన్నారు. స్పెషలిస్ట్ సర్వీసులు కూడా దీని ద్వారా పొందవచ్చు Tsmidcకు కూడా సీసీ కెమెరాలను అనుసంధానం చేశామని తెలిపారు. సేఫ్టీ, సెక్యూరిటీ కోసం పిహెచ్సీ హబ్ ఉపయోగపడుతుంది. దేశంలోనే మొట్టమొదటి సారిగా ఈ విధానాన్ని అమలు చేస్తున్నాము.43 కొత్త పిహెచ్సీ భవనాలను 67 కోట్లతో, 43 కోట్లతో పిహెచ్ సిలకు మరమ్మతులు చూస్తున్నామని పేర్కొన్నారు. ఏఎన్ఎమ్ సబ్ సెంటర్లలకు 1239 ప్రాంతాల్లో 240 కోట్లు కేటాయింపు చేశాం. మునుగోడు ఉప ఎన్నికల వల్ల డాక్టర్ల భర్తీ ఆలస్యం అయ్యింది. ఈసీ అనుమతి ఇవ్వలేదన్నారు.