Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో మరోసారి భారీగా బంగారం పట్టుబడింది. దుబాయ్ నుంచి హైదరాబాద్ వచ్చిన ఇద్దరు ప్రయాణికులు బంగారాన్ని పేస్టులా మార్చి అక్రమంగా తరలించేదుకు యత్నించారు. అయితే కస్టమ్స్ అధికారులకు వారిపై అనుమానం రావడంతో తనిఖీ చేశారు. ఈ క్రమంలో వారివద్ద ఉన్న పర్సుల్లో పేస్టు రూపంలో ఉన్న బంగారం పట్టుడింది. దీంతో అక్రమంగా తరలిస్తున్న పసిడిని అధికారులు సీజ్ చేశారు. దీనివిలువ దాదాపు రూ.3 కోట్లు ఉంటుందని చెప్పారు. ఇద్దరు దుబాయ్ ప్రయాణికులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.