Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: భారత ప్రధాని మోడి విశాఖ నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాదులోని బేగంపేట్ ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. ఈ తరుణంలో ఎయిర్ పోర్టులో ప్రధాని మోడి కి గవర్నర్ తమిళిసై, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ లక్ష్మణ్, ఎమ్మెల్యే రఘునందన్, బీజేపీ నేతలు రాజగోపాల్ రెడ్డి, పొంగులేటి, డీకే అరుణ తదితరులు స్వాగతం పలికారు. అనంతరం బేగంపేట ఎయిర్ పోర్ట్ బయట ఏర్పాటు చేసిన సభ వేదికపైకి ప్రధాని చేరుకున్నారు. ప్రస్తుతం బీజేపీ శ్రేణులను ఉద్దేశించి ప్రధాని ప్రసంగిస్తున్నారు. తెలంగాణలో కమలం వికసించే పరిస్థితులు కనిపిస్తున్నాయని దేశ ప్రధాని మోడీ సంచలన ప్రకటన చేశారు. తెలంగాణ పేరు చెప్పి ప్రజలను కొందరు మోసం చేస్తున్నారని అలాగే, పదవులు పొందుతున్నారని ఆగ్రహించారు. బీజేపీ నాయకులు ఇక్కడి నాయకులను బలంగా ఎదుర్కొంటున్నారన్నారు. ఫ్యామిలీ కాదు పీపుల్స్ ఫస్ట్ అంటూ కౌంటర్ వేశారు. మొదట్లో బీజేపీకి రెండు ఎంపీ సీట్లు వస్తే అందులో ఒకటి తెలంగాణ నుంచి జంగారెడ్డి గెలిచారని గుర్తు చేశారు.