Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సిమ్లా: సాధారణంగా పార్లమెంటుకుగానీ, అసెంబ్లీలకుగానీ ఎన్నికలు జరిగినప్పుడు 70-75 శాతం పోలింగ్ నమోదైందంటే చాలా ఎక్కువ. ఓటు విలువ తెలిసిన వారు ఓటు హక్కును ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునేందుకు రాజ్యాంగం తమకు ఇచ్చిన ఆయుధంగా భావిస్తారు. మంచు ప్రాంతాలతో కూడిన హిమాచల్‌ప్రదేశ్‌లో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఓటర్లు చాలా కష్టపడాల్సి వస్తుంది. మంచు కొండలపై నడుస్తూ పోలింగ్ కేంద్రాలకు వెళ్లాల్సి ఉంటుంది. చాంబా జిల్లా పంగి తహసీల్‌లోని చసాక్ భటోరి పోలింగ్‌స్టేషన్‌లో ఓటు వేసేందుకు ఓటర్లు మంచు కొండలపై నడుస్తూ వెళ్తున్న దృశ్యాన్ని ఇక్కడ చూడవచ్చు. వీళ్లే కాదు, హిమాచల్‌ప్రదేశ్‌లోని చాలా నియోజకవర్గాల్లో ప్రజలు ఓటేసేందుకు ఇలాంటి ప్రయాసలను ఓర్చుకోక తప్పదు. వీళ్లను చూసైనా పోలింగ్ జరుగుతుంటే ఇండ్ల నుంచి బయటకురాని బద్దకస్తుల్లో మార్పు రావాలని ఓటు విలువ తెలిసిన వారు అంటున్నారు.