Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: హైదరాబాదు బేగంపేటలో ఏర్పాటు చేసిన సభలో ప్రధాని మోడి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం అభివృద్ధి వ్యతిరేకులతో జట్టుకట్టిందన్నారు. ప్రజలను లూటీ చేసే ఎవరినీ వదిలిపెట్టే ప్రసక్తేలేదని హెచ్చరించారు. గత 22 ఏళ్లుగా ఎన్నో తిట్లు తిన్నాను. రోజూ కిలోల కొద్దీ తిట్లు తింటాను అందుకే నేను అలసిపోను ఎన్ని తిట్లు తిన్నా అరిగించుకోగల శక్తి నాకుంది అంటూ చమత్కరించారు. అయితే, నన్ను తిట్టండి సహిస్తా కానీ తెలంగాణ ప్రజల జోలికి వస్తే ఉపేక్షించేది లేదని, తెలంగాణ ప్రజలకు అన్యాయం చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి అని స్పష్టం చేశారు. ఒక అసెంబ్లీ స్థానం కోసం తెలంగాణ ప్రభుత్వం యావత్తు మునుగోడులో మకాం వేసిందని, మునుగోడు ఉప ఎన్నిక ద్వారా ప్రజలు బీజేపీకి ఒక భరోసా ఇచ్చారన్నారు. తెలంగాణలో అంధకారం ఇక ఎక్కువ రోజులు ఉండదు తెలంగాణలో వచ్చేది బీజేపీ సర్కారేనని ప్రజలు చాటిచెప్పారు. తెలంగాణ బీజేపీ కార్యకర్తలు బలమైన శక్తులు, ఎవరికీ భయపడరు వారిని చూసి నేను స్ఫూర్తి పొందుతాన్నారు.
అవినీతిపరులంతా ఏకమయ్యేందుకు ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు. తెలంగాణలో కుటుంబ పాలన పోవాలని, పేదల కోసం పనిచేసే బీజేపీ ప్రభుత్వం రావాలని పిలుపునిచ్చారు. పీపుల్స్ ఫస్ట్ అనేది బీజేపీ నినాదమని, తెలంగాణలో అవినీతి రహిత పాలన అందించేందుకు బీజేపీ సిద్ధంగా ఉందని అన్నారు.