Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పెద్దపల్లి: జిల్లాలోని రామగుండంలో కార్మికసంఘాల నేతలను పోలీసులు ముందుస్తుగా అరెస్ట్ చేశారు. ప్రధాని పర్యటనను అడ్డుకుంటామని నాలుగు జాతీయ కార్మికసంఘాలు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో అప్రమత్తమైన పోలీసులు... విప్లవ కార్మికసంఘాలు, పౌరహక్కుల సంఘం నేతలు, విద్యార్థి సంఘం నాయకులను అదుపులోకి తీసుకుంటున్నారు. అటు గోదావరిఖని బంద్‌కు సీపీఐ పిలుపునిచ్చింది. మరోవైపు ప్రధాని పర్యటనకు నిరసనగా మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్, మందమర్రి, బెల్లంపల్లి ఏరియాల్లోని బొగ్గు గనుల్లో కార్మిక సంఘాలు ఆందోళనకు దిగారు. గో బ్యాక్ మోదీ అంటూ కార్మికులు నల్లబ్యాడ్జీలతో విధులకు హాజరయ్యారు. బొగ్గు గనులను ప్రైవేటీకరిస్తున్న మోదీకి ఈ ప్రాంతంలో పర్యటించే అర్హత లేదని కార్మికులు చెబుతున్నారు. కాగా... కార్మిక సంఘాల నేతలను పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకుంటున్నారు.