Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మెల్‌బోర్న్: అంతర్జాతీయ క్రికెట్ మండలి చైర్మెన్‌గా న్యూజిలాండ్‌కు చెందిన గ్రెగ్ బార్ల్కే రెండోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రెండేళ్ల పాటు ఆయన కాలపరిమితి ఉంటుంది. ఐసీసీ ఫైనాన్స్ అండ్ కమర్షియల్ అఫైర్స్ కమిటీ హెడ్‌గా బీసీసీఐ కార్యదర్శి జే షా ఎన్నికయ్యారు. జింబాబ్వేకు చెందిన తవెంగ్వ ముకులాని ఎన్నికల ప్రక్రియ నుంచి తప్పుకోవడంతో బార్ల్కే ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఐసీసీ డైరెక్టర్లకు ఈ సందర్భంగా ఆయన థ్యాంక్స్ తెలిపారు.
ఐసీసీలో కీలకమైన ఫైనాన్స్ కమిటీకి అధిపతిగా జే షా కొనసాగనున్నారు. అంతర్జాతీయ క్రికెట్ మండలికి చెందిన అన్ని ఆర్థిక విధాన నిర్ణయాలను ఎఫ్ అండ్ సీఏ కమిటీ తీసుకుంటుంది. ప్రతి ఒక సభ్యుడు జేషాను ఫైనాన్స్ కమిటీ హెడ్‌గా అంగీకరించినట్లు ఓ అధికారి తెలిపారు. క్రికెట్ ఆడుతున్న దేశాల మధ్య ఆదాయ పంపకాన్ని ఫైనాన్స్ కమిటీ చూసుకుంటుంది. గత ఏడాది బీసీసీఐ మాజీ అధ్యక్షుడు గంగూలీ ఫైనాన్స్ కమిటీలో సభ్యుడిగా ఉన్నారు. గ్లోబల్ మార్కెట్‌కు ఇండియా కమర్షియల్ హబ్ అని, 70 శాతం స్పాన్సర్‌షిప్ ఆ ప్రాంతం నుంచే వస్తుందని, అలాంటి సందర్భంలో ఐసీసీ ఫైనాన్స్ కమిటీ బాధ్యతల్ని బీసీసీఐ చూసుకోవాల్సి ఉంటుందని ఐసీసీ వర్గాలు వెల్లడించాయి.