Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: బేగంపేటలో బీజేపీ శ్రేణుల కోసం ఏర్పాటు చేసిన సభ ముగిసిన తర్వాత... ఎయిర్ పోర్టులో బీజేపీ నేతలతో ప్రధాని మోడీ కాసేపు ముచ్చటించారు. లైన్ లో ఉన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని బీజేపీ నేతలు ప్రధానికి పరిచయం చేశారు. దీంతో, రాజగోపాల్ రెడ్డి వద్ద ఆగిన మోడీ ఆయనతో ప్రత్యేకంగా రెండు నిమిషాల సేపు ముచ్చటించారు. మునుగోడు ఉపఎన్నికలో బాగా కష్టపడ్డారని అభినందించారు. టీఆర్ఎస్ కు ముచ్చెమటలు పట్టించారంటూ భుజం తట్టి అభినందనలు తెలియజేశారు. నేను చూసుకుంటా అంటూ కోమటిరెడ్డికి వ్యక్తిగతంగా హామీ ఇచ్చారు. మిగిలిన నాయకులతో మాట్లాడుతూ తెలంగాణలో తాజా రాజకీయ పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం అక్కడి నుంచి సైనిక హెలికాప్టర్ లో రామగుండంకు బయల్దేరారు.