Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోడీ ఇవాళ హైదరాబాదు వచ్చిన సంగతి తెలిసిందే. తెలంగాణ బీజేపీ నాయకత్వం మోడీ రాకను పురస్కరించుకుని బేగంపేటలో స్వాగత సభ ఏర్పాటు చేసింది. ఈ సభకు తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యేలు కూడా విచ్చేశారు. ఈ సందర్భంగా దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు ప్రధాని మోడీకి అపురూపమైన కానుక బహూకరించారు. ప్రధాని మోడీ చెంత శ్రీరాముడు ఉన్నట్టు ఈ పటంలో చిత్రించారు. ఈ విశిష్ట కానుక అందుకున్న మోడీ ఎంతో సంతోషించారు. రఘునందన్ రావుకు కృతజ్ఞతలు తెలిపారు. కాగా, మునుగోడులో ఓటమిపాలైనప్పటికీ తెలంగాణ బీజేపీ శ్రేణులను మోడీ అభినందించారు. నికార్సయిన పోరాటం కనబరిచారంటూ కొనియాడారు. మున్ముందు కూడా ఇదే తరహాలో పోరాడాలంటూ ప్రోత్సాహ వచనాలు పలికారు.