Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రాజస్థాన్: భర్త కళ్లెదుటే 45 ఏళ్ల మహిళపై నలుగురు దుండగులు సామూహిక లైంగికదాడికి పాల్పడ్డారు. ఈ ఘటన రాజస్థాన్ రాష్ట్రం సిరోహి జిల్లాలో బుధవారం రాత్రి చోటు చేసుకుంది. కాగా, కేసుకు సంబంధించిన వివరాలను పోలీసులు తాజాగా వెల్లడించారు. పిండ్వారా డీఎస్పీ జెతు సింగ్ తెలిపిన వివరాల ప్రకారం.. బుధవారం రాత్రి సమయంలో నలుగురు దుండగులు దొంగతనం చేసేందుకు ఓ ఇంట్లోకి చొరబడ్డారు. ఆ ఇంట్లోని దంపతులను బెదిరించి రూ.1,400 నగదు, కొంత వెండి, బంగారు ఆభరణాలను లాక్కున్నారు. అనంతరం భర్తను కట్టేసి అతని కళ్లెదుటే భార్యపై సామూహిక లైంగికదాడికి పాల్పడ్డారు. రెండు రోజుల అనంతరం దంపతులు స్థానిక పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలింపు చేపట్టారు. ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకోగా ఒకరు పరారీలో ఉన్నట్లు డీఎస్పీ వివరించారు.