Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలు సాఫీగా కొనసాగుతున్నాయి. మధ్యాహ్నం 3 గంటల వరకు 56 శాతం పోలింగ్ నమోదైంది. పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుననది. రాష్ట్ర అసెంబ్లీలోని మొత్తం 68 స్థానాలకు పోలంగ్ జరుగుతున్నది. లాహౌల్ స్పితిలో అత్యధికంగా 62.75 శాతం ఓటింగ్ నమోదైంది. రెండో స్థానంలో 60.38 శాతం ఓటింగ్‌తో సిర్మౌర్ ఉన్నది. సీఎం జైరామ్ ఠాకూర్ సొంత జిల్లా మండిలో 58.90 శాతం ఓటింగ్ పోలైంది. చంబా జిల్లాలో అత్యల్పంగా 46 శాతం పోలింగ్ జరిగింది.
హిమాచల్ అసెంబ్లీ బరిలో మొత్తం 412 మంది అభ్యర్థులున్నారు. రాష్ట్రంలోని దాదాపు 56 లక్షల మంది ఓటర్లు తమ భవితవ్యాన్ని నిర్ణయించనున్నారు. వీరిలో పురుషులు 28,54,945 మంది, మహిళలు 27,37,845 మంది, థర్డ్ జెండర్ ఓటర్లు 38 మంది ఉన్నారు. డిసెంబర్ 8న ఓట్ల లెక్కింపు జరగనున్నది. 2017లో రాష్ట్రంలో 75.57 శాతం ఓటింగ్ నమోదైంది.