Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పల్నాడు: ఇద్దరు పిల్లలు సహా తల్లి ఆత్మహత్య చేసుకున్న ఘటన పల్నాడు జిల్లా నుజేండ్ల మండలం తెల్లబాడులో జరిగింది. సౌజన్య లక్ష్మి(26)కి పెళై ఇద్దరు పిల్లలున్నారు. వివాహేతర సంబంధం కారణంగా భార్యాభర్తల మధ్య కొంతకాలంగా విభేదాలున్నాయి. ఈ నేపథ్యంలో సౌజన్య లక్ష్మి తన ఇద్దరి పిల్లలు మనితేజ, శివ పార్వతికి గడ్డి మందు తాపించి, తనూ తాగింది. పిల్లలు చనిపోగా..నరసరావుపేటలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో సౌజన్య లక్ష్మి చికిత్స పొందుతూ మృతిచెందింది.