Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: ఇవాళ బేగంపేట్ లో ప్రసంగించిన ప్రధాని మోడీ తెలంగాణలో కమలం వికసించనుందని అన్న విషయం తెలిసిందే. అయితే ఈ వ్యాఖ్యలకు వై.యస్.ఆర్.టి.పి పార్టీ అధినేత వైఎస్ షర్మిల స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. కమలం వికసిస్తుందని చెవిలో పువ్వులు బాగానే పెట్టారని వ్యగ్యంగా కామెంట్ చేశారు. తెలంగాణా అంతటా కమలం వికసిస్తుందంటున్న మోడీగారు, మీ పూలు వికసించాలి, మా తెలంగాణ ప్రజల చెవుల్లో పెట్టాలి, అంతేనా సారూ? అని అన్నారు. ఇంకెన్ని పూలు వికసింపజేసుకుంటారు, ఎన్ని మా చెవిలో పెడతారు? అని ఫైర్ అయ్యారు. మెగాస్కాం కాళేశ్వరంతో రూ.వేల కోట్లు వెనకేసుకున్న కమిషన్ రావు అండ్ కో మీద చర్యలేవి, కాళేశ్వరంలో భారీ అవినీతి జరిగిందని గప్పాలు కొట్టే బీజేపీ పెద్దలు ఎందుకు ఎంక్వైరీ చేయించడం లేదని విమర్శించారు.