Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: తెలంగాణ పర్యటనకు విచ్చేసిన ప్రధాని నరేంద్ర మోదీ ఈ మధ్యాహ్నం రామగుండం వెళ్లారు. రామగుండం ఎరువుల కర్మాగారాన్ని జాతికి అంకితం చేశారు. ఆర్ఎఫ్ సీఎల్ లో ఎరువుల ఉత్పత్తిని పరిశీలించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన ప్రసంగిస్తూ భవిష్యత్ లో భారత్ యూరియా పేరిట ఒకటే బ్రాండ్ లభ్యం అవుతుందని తెలిపారు. ఎరువుల బ్లాక్ మార్కెటింగ్, నకిలీ లేకుండా చర్యలు చేపడతామని వెల్లడించారు. రైతులకు ఎరువుల కొరత రాకుండా అనేక చర్యలు చేపట్టామని అన్నారు.
విదేశాల నుంచి అధిక ధరలకు యూరియాను దిగుమతి చేసుకోవాల్సి వస్తుందని, అయితే తక్కువ ధరకే రైతులకు నీమ్ కోటింగ్ యూరియా అందిస్తున్నామని మోడీ వెల్లడించారు. ఐదు ప్రాంతాల్లోని ఎరువుల కర్మాగారాల్లో 70 లక్షల టన్నుల యూరియా ఉత్పత్తి అవుతోందని వివరించారు. భూసార పరీక్షలు చేసి రైతులకు కార్డులు అందిస్తున్నామని, నేల స్వభావాన్ని బట్టి రైతులు పంటలు వేసుకునేలా చర్యలు చేపట్టామని అన్నారు. నానో యూరియా టెక్నాలజీని రైతులకు అందుబాటులోకి తెచ్చామని తెలిపారు. ఖమ్మం జిల్లాలో మరో రైల్వే లైన్ ను ప్రారంభించామని, కొత్త రైల్వే లైనుతో ప్రజలకు, విద్యుత్ రంగానికి ప్రయోజనకరం అని వివరించారు.