Authorization
Mon Jan 19, 2015 06:51 pm
షిమ్లా: హిమాచల్‌ప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. పోలింగ్ ముగియగానే అధికారులు ఈవీఎంలు, వీవీప్యాట్‌లను సీల్ చేశారు. అనంతరం అన్ని పోలింగ్ బూత్‌లలోని ఈవీఎంలు, వీవీప్యాట్‌లను ధర్మశాల, షిమ్లా పోలింగ్ స్టేషన్‌లకు తరలించి భద్రపర్చారు. వాటిని భద్రపర్చిన పోలింగ్ బూత్‌ల వద్ద కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉదయం పోలింగ్ ప్రారంభమైనప్పటి నుంచి ఓటర్లు పోటీపడి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. యువతతోపాటు వృద్ధులు కూడా పోటీపడి ఓట్లు వేశారు. దాంతో సాయంత్రం 5 గంటలకు పోలింగ్ సమయం ముగిసేటప్పటికి 65.92 శాతం పోలింగ్ నమోదైంది. అయితే ఆ తర్వాత కూడా క్యూ లైన్‌లలో ఉన్న ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటుండటంతో పోలింగ్ శాతం మరింత పెరిగే అవకాశం ఉన్నదని అధికారులు తెలిపారు.
హిమాచల్‌ప్రదేశ్‌లో మొత్తం 68 అసెంబ్లీ నియోజకవర్గాలు ఒకే విడతలో పోలింగ్ నిర్వహించారు. అన్ని స్థానాల్లో కలిపి 412 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. వీరిలో 94 మంది అభ్యర్థులకు నేర చరిత్ర ఉన్నదని అధికారులు తెలిపారు. అందులో అత్యధికంగా బీజేపీ అభ్యర్థులు ఉన్నారు. ఆ తర్వాత కాంగ్రెస్, ఆప్, ఇండిపెండెంట్ అభ్యర్థులు ఉన్నట్లు చెప్పారు. కాగా, ఇవాళ పోలైన ఓట్లను వచ్చే నెల 8న ఈ లెక్కించి ఫలితాలు వెల్లడించనున్నారు.