Authorization
Mon Jan 19, 2015 06:51 pm
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్‌ను భూకంపం మరోసారి వణికించింది. రిక్టర్ స్కేల్‌పై 3.4తీవ్రతతో శనివారం
సాయంత్రం 4.25 గంటలకు భూకంపం సంభవించింది. రిషికేశ్‌లో భూమికి ఐదు కిలోమీటర్ల లోతులో
భూకంప కేంద్రం గుర్తించినట్లు నేషనల్ సిస్మోలజీ సెంటర్ తెలిపింది. ఒక్కసారిగా వచ్చిన ప్రకంపనలతో
ఇండ్ల నుంచి జనం పరుగులుపెట్టారు. అయితే, ఆస్తి, ప్రాణ నష్టానికి సంబంధించి ఎలాంటి నివేదికలు
అందలేదని అధికారులు పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా.. ఈ నెల 9న ఒకేరోజు రెండుసార్లు భూమి కంపించింది. ఉత్తరాఖండ్ సహా ఉత్తర భారత్‌లోనూ ప్రకంపనలు నమోదయ్యాయి. ఉదయం 6.27 గంటలకు, మధ్యాహ్నం 6.27 గంటల సమయంలో రెండోసారి భూమి కంపించింది. 6.3 తీవ్రతతో తొలిసారి ప్రకంపనలు రాగా.. నేపాల్‌లో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. రెండోసారి 4.3 తీవ్రతతో భూమి కంపించింది. భూకంప కేంద్రాన్ని ఉత్తరాఖండ్‌లోని పితోర్‌గఢ్‌లో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు అధికారులు తెలిపారు.