Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వనపర్తి: యాసంగి సీజన్‌లో రెండో పంట సాగుకు డిసెంబర్‌లో రైతుబంధు సాయం అందజేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి వెల్లడించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు ఆర్థిక శాఖ ఆమోదం లభించిందని తెలిపారు. శనివారం వనపర్తి జిల్లా కేంద్రంలోని నాగవరం సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ.. రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. పండిన ప్రతి గింజనూ కొంటామని భరోసానిచ్చారు. రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా కొనుగోళ్ల ప్రక్రియ చేపట్టాలని అధికారులను మంత్రి ఆదేశించారు.