Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: రాష్ట్రంలో ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలను 2023 మార్చిలో నిర్వహించనున్నారు. ఈ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు సోమవారం నుంచి ఈ నెల 30 వరకు ఫీజు చెల్లించవచ్చన్నారు. రూ.100 ఆలస్య రుసుముతో డిసెంబర్ 2 నుంచి 6 వరకు, రూ.500 రుసుముతో 8 నుంచి 12 వరకు, 1000 రుసుముతో 14 నుంచి 17 వరకు, రూ.2000 ఆలస్య రుసుముతో డిసెంబర్ 19 నుంచి 22 వరకు ఫీజు చెల్లించవచ్చు. ఫస్టియర్, సెకండియర్ జనరల్ కోర్సుల విద్యార్థులు రూ.500, సైన్స్, వొకేషనల్ విద్యార్థులు రూ.710 ఫీజుగా చెల్లించాలని అధికారులు సూచించారు. ఈ సంవత్సరం 100 శాతం సిలబస్ అమలవుతుందని, పాతపద్ధతిలోనే పరీక్షలను నిర్వహిస్తామని వెల్లడించారు. కాలేజీల్లో అడ్మిషన్ పొందకుండా, హాజరుశాతం లేకుండా హాజరు మినహాయింపు పథకం కింద విద్యార్థులు రూ.500 ఫీజు కట్టి పరీక్షలు రాయెచ్చని తెలిపారు. అలాంటి విద్యార్థులు ఈ నెల 14 నుంచి 30 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు.