Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : టీ20 ప్రపంచకప్ తుది అంకానికి చేరుకుంది. ట్రోఫీలో ఫేవరెట్లుగా పరిగణించిన టీమిండియా, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, న్యూజిలాండ్ తదితర పెద్ద జట్లు ఇప్పటికే ఇంటిదారి పట్టాయి. ఏమాత్రం అంచనాలు లేని ఇంగ్లండ్, పాకిస్థాన్ టీమ్‌లు తుది పోరుకు చేరుకున్నాయి. ఇరు జట్ల మధ్య ఆదివారం మెల్‌బోర్న్ వేదికగా ఫైనల్ సమరం జరుగనుంది. భారత్‌ను ఓడించి ఇంగ్లండ్ టైటిల్ పోరుకు దూసుకెళ్లగా, పటిష్టమైన న్యూజిలాండ్‌ను మట్టి కరిపించి పాకిస్థాన్ ఫైనల్ బెర్త్‌ను సొంతం చేసుకుంది. 1992లో ఆస్ట్రేలియా వేదికగా జరిగిన వన్డే ప్రపంచకప్‌లో ఇంగ్లండ్-పాకిస్థాన్ జట్లు ఫైనల్లో తలపడిన విషయం తెలిసిందే. తాజాగా మరోసారి ఇరు జట్లు తుది సమరంలో అమీతుమీ తేల్చుకోనున్నాయి. అయితే ఈసారి టి20 ప్రపంచకప్‌లో రెండు ట్రోఫీ కోసం తలపడుతున్నాయి. ఈ సారీ టీ20 ట్రోఫీ ఎవరిని వరిస్తుందో చూడాలి.