Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : ఫిఫా పుట్ బాల్ ప్రపంచకప్ వచ్చేస్తోంది. మరో ఎనిమిది రోజుల్లో విశ్వ సాకర్ సమరానికి తెరలేవనుంది. 32 జట్లు, ఒక కప్పు అటు మైదానంలో పోటీ ఇటు అభిమానులకు కిక్కు ఇక మాయలో పడేందుకు సిద్దమైపోవాల్సిన తరుణం ఆసన్నమైంది. ప్రపంచవ్యాప్తంగా అత్యంత ఆదరణ పొందిన ఆటలో అత్యున్నత టోర్నీకి రంగం సిద్దమవుతోంది. ఈ నెల 20న ఖతార్‌లో ప్రపంచకప్ ఆరంభమవుతుంది. దాదాపు నెల రోజుల పాటు సాగే ఇక కిక్కే కిక్కు! ఖతార్ జాతీయ దినోత్సవమైన వచ్చే నెల 18న ఫైనల్ జరుగుతుంది. ఆ దేశం తొలిసారి ఈ ప్రపంచకప్‌కు ఆతిథ్యమిస్తోంది. అక్కడ అధిక ఊష్ణోగ్రతల ప్రభావాన్ని తప్పించుకోవడం కోసం శీతాకాలంలో మ్యాచులు నిర్వహించనున్నారు.