Authorization
Sat May 17, 2025 02:38:18 am
హైదరాబాద్ : తెలంగాణ రాజకీయాల్లో పెను ప్రకంపనలు రేపిన ఎమ్మెల్యేల కొనుగోలు కేసు రోజుకొ కీలక పరిణామం చోటుచేసుకుంటోంది. ఇప్పటికే ఈ కేసులో పలు పరిణామాలు చోటుచేసుకోగా... ఆదివారం ఈ వ్యవహారంలో మరో కొత్త కేసు నమోదైంది. ఈ కేసులో బాధితులుగా ఉన్న టీఆర్ఎస్ కు చెందిన నలుగురు ఎమ్మెల్యేలకు బెదిరింపు కాల్స్ వచ్చాయి. దీనిపై ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేయగా... బంజారా హిల్స్ పోలీసులు కొత్తగా ఓ కేసు నమోదు చేశారు. ఉత్తరప్రదేశ్, గుజరాత్ ల నుంచి గుర్తు తెలియని వ్యక్తులు తమకు ఫోన్ చేసి బెదిరిస్తున్నారంటూ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పైలట్ రోహిత్ రెడ్డి, బీరం హర్షవర్ధన్ రెడ్డిలు ఆదివారం బంజారా హిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుల ఆధారంగా కేసు నమోదు చేసుకున్న బంజారా హిల్స్ పోలీసులు సదరు పోన్ కాల్స్ వచ్చిన నెంబర్లను సేకరించి... టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఫోన్లు చేసి బెదిరిస్తున్న వారెవరన్న విషయాలను నిగ్గు తేల్చే పనిలో పడ్డారు.