Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ మండలం ఐలాపూర్‌లో విషాదం చోటుచేసుకున్నది. బట్టలు ఉత్తకడానికి చెరువుకు వెళ్లి తల్లీకూతుళ్లు గల్లతయ్యారు. ఐలాపూర్‌కు చెందిన లావణ్య, యాదమ్మ తల్లీకూతుళ్లు. ఆదివారం ఉదయం ఇద్దరు కలిసి చెరువులో బట్టలు ఉతకడానికి వెళ్లారు. ఈ క్రమంలో నీటిలో మునిగి గల్లంతయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. స్థానికులతో కలిసి గాలింపు చేపట్టారు. కూతురు లావణ్య మృతదేహం లభించగా, యాదమ్మ కోసం గాలిస్తున్నారు. అయితే యాదమ్మను వెతికే క్రమంలో ఆమె సోదరుడు ఊసరయ్య చెరువులో పడి గల్లంతయ్యాడు. దీంతో ఇరువురి కోసం గాలింపు ముమ్మరం చేశారు.