Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : ఇంగ్లండ్, పాకిస్థాన్ జట్ల మధ్య జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ 2022 ఫైనల్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ జట్టు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. దీంతో పాకిస్తాన్ బ్యాటింగ్ కు దిగనుంది. మెల్‌బోర్న్‌లోని మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో ఈ రసవత్తర పోరుకు వేదికైంది. టీమిండియాతో జరిగిన సెమీ ఫైనల్‌లో కూడా ఇంగ్లండ్ టాస్ గెలిచి బౌలింగే ఎంచుకుంది. ఆ తర్వాత టీమిండియా నిర్దేశించిన టార్గెట్‌ను ఒక్క వికెట్ కోల్పోకుండా ఛేదించి టీమిండియాను ఇంగ్లండ్ చిత్తుగా ఓడించిన సంగతి తెలిసిందే. పాక్‌తో ఫైనల్‌లో కూడా ఇంగ్లండ్ ఇదే గేమ్ ప్లాన్‌ను అనుసరించడంతో ఏం జరగనుందోనన్న ఆసక్తి మొదలైంది.