Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబై: భారత నావికాదళానికి చెందిన 25 ఏళ్ల నావికుడు ఒకరు విధి నిర్వహణలో ఉండగా సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేకున్నాడు. షిప్‌పై డిప్యూటేషన్‌లో ఉండగా శనివారం మధ్యాహ్నం ఆత్మహత్య చేసుకున్నట్టు ముంబై పోలీసులు తెలిపారు. ప్రమాదవశాత్తూ జరిగిన ఘటనగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు ఇండియన్ నావీ తెలిపింది. కొలబా పోలీసులు ఏడీఆర్ కింద కేసు నమోదు చేశారు. కాగా, ఆయన ఆత్మహత్యకు పాల్పడడానికి కారణం ఏమిటనేది తెలియలేదు. ఒత్తడి తట్టుకోలేక ఈ చర్యకు పాల్పడ్డాడా, వేరే కారణం ఏమైనా ఉందా అనే దానిపై అధికారులు ఆరా తీస్తున్నారు.