Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో నిందితుడిగా ఉన్న నందకుమార్‌కు చెందిన అక్రమ నిర్మాణాలను జీహెచ్‌ఎంసీ అధికారులు కూల్చివేశారు. ఫిల్మ్‌నగర్‌లోని హోటల్ డెక్కన్ కిచెన్‌లో కొంతభాగాన్ని జీహెచ్‌ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులు తొలగించారు. నిర్మాత దగ్గుబాటి సురేష్‌బాబుకు చెందిన స్థలాన్ని నందకుమార్ లీజుకు తీసుకున్నారు. అయితే ఎలాంటి అనుమతులు లేకుండా దక్కన్ కిచెన్ ప్రాంగణంలో రెండు అక్రమ నిర్మాణాలు చేపట్టారు. అధికారులు అనేకసార్లు నోటీసులు ఇచ్చినా పనులు ఆపకుండా కొనసాగిస్తుండటంతో ఆదివారం కూల్చివేతలను చేపట్టారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ బందోబస్తు మధ్య అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు.