Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మెల్‌బోర్న్: టీ20 వరల్డ్ కప్ 2022 ఉత్కంఠభరిత ఫైనల్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ విశ్వవిజేతగా అవతరించింది. ప్రత్యర్థి పాకిస్తాన్ నిర్దేశించిన 138 పరుగుల విజయ లక్ష్యాన్ని 19 ఓవర్లలో ఇంగ్లండ్ బ్యాటర్లు చేధించారు. టార్గెట్ స్వల్పమే అయినా మ్యాచ్‌ను నిలబెట్టుకునేందుకు పాకిస్తాన్ బౌలర్లు విశ్వప్రయత్నం చేశారు. కానీ కీలక సమయాల్లో వికెట్లు పడకపోవడంతో ఇంగ్లండ్ గెలుపు ఖాయమైంది. ఇంగ్లండ్ బ్యాటర్లలో బెన్ స్టోక్స్ అద్భుతంగా రాణించాడు. ఫైనల్ మ్యాచ్.. అందులోనూ ఛేజింగ్‌లో ఒత్తిడి తట్టుకుని ఇంగ్లండ్‌ను విజయ తీరాలకు చేర్చాడు. 49 బంతుల్లో 52 పరుగులు కొట్టి చివరి వరకూ క్రీజులో నిలబడ్డాడు. నాలుగు ఓవర్లు వేసి 3 వికెట్లు కేవలం 12 పరుగులు మాత్రమే ఇచ్చినా సామ్ కర్రాన్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ దక్కింది. పాకిస్తాన్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. మ్యాచ్ ఒక దశలో పాక్ రేసులోకి వచ్చినట్టు కనిపించింది. కానీ కీలక సమయంలో వికెట్లు పడకపోవడంతో ఇంగ్లండ్‌దే పైచేయి అయ్యింది. షాషీన్ అఫ్రిదీ, షాదాబ్ ఖాన్, మహ్మద్ వసీం జూనియర్ తలో వికెట్ తీయగా.. హారిస్ రౌఫ్ 2 వికెట్లు తీశారు.