Authorization
Mon Jan 19, 2015 06:51 pm
శ్రీశైలం: పవిత్ర కార్తీకమాసం, ఆదివారం సెలవుదినం కావడంతో శ్రీశైల మహా క్షేత్రం భక్తుల రద్దీతో కిటకిటలాడుతుంది. కార్తీక మాస ఉత్సవాలను పురస్కరించుకొని తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. తెల్లవారుజాము నుంచి భక్తులు శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామివారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. భక్తులతో ఆలయ క్యూలైన్లన్నీ నిండిపోయాయి. ఉచిత దర్శనానికి 4గంటలు, రూ.300 టికెట్ దర్శనానికి 2గంటలు, రూ.500ల శీఘ్ర దర్శనానికి గంటన్నర సమయం పడుతోంది. భక్తుల రద్దీతో వసతి సముదాయాలన్నీ నిండిపోయాయి. సోమవారం వరకు భక్తుల రద్దీ కొనసాగుతుందని ఆలయ అధికారులు భావిస్తున్నారు.