Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: నందమూరి బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం వీరసింహారెడ్డి. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌లో భారీ బడ్జెట్‌తో వస్తున్న ఈ మూవీలో శృతిహాసన్ హీరోయిన్‌గా నటిస్తోంది. కన్నడ యాక్టర్ ధునియా విజయ్ విలన్‌గా నటిస్తున్నాడు. కాగా డైరెక్టర్ గోపీచంద్ ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ అందించి నందమూరి అభిమానులు, ఫాలోవర్లలో ఫుల్ జోష్ నింపుతున్నాడు. ఈ చిత్రంలో కేజీఎఫ్ యాక్టర్ భాగం అయ్యాడు. కేజీఎఫ్ ప్రాంచైజీలో ఆండ్రీవ్స్ పాత్రలో నటించిన కన్నడ యాక్టర్ అవినాష్ పవర్ ప్యాక్‌డ్ పాత్రలో కనిపించబోతున్నాడు. తాజా అప్‌డేట్ ప్రకారం ఈ చిత్రంలో గంగిరెడ్డి పాత్రలో కనిపించబోతున్నాడని తెలుస్తోండగా.. ప్రస్తుతం గంగిరెడ్డి పోర్షన్ షూట్ చేస్తున్నట్టు ఫిలింనగర్ సర్కిల్ టాక్. అవినాష్ పాత్ర ప్రేక్షకుల్లో గూస్ బంప్స్ తెప్పించడం ఖాయమట. ఈ చిత్రంలో వరలక్ష్మి శరత్‌కుమార్ కీలక పాత్ర పోషిస్తోంది.