Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : ఉత్తర భారతదేశంలో వరుస భూకంపాలు సంభవిస్తున్నాయి. గతవారం ఢిల్లీతో సహా దాని పరిసర ప్రాంతాల్లో రెండు సార్లు భూమి కంపించిన విషయం తెలిసిందే. తాజాగా పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో స్వల్ప భూకంపం వచ్చింది. సోమవారం తెల్లవారుజామున 3.42 గంటలకు భూ ప్రకంపణలు చోటుచేసుకున్నాయి. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.1గా నమోదయిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ తెలిపింది. అమృత్‌సర్‌కు 145 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నదని వెల్లడించింది. భూ అంతర్భాగంలో 120 కిలోమీటర్ల లోతులో ప్రకంపణలు చోటుచేసుకున్నాయని పేర్కొన్నది. గతవారం దేశరాజధాని ఢిల్లీతోపాటు సమీప ప్రాంతాల్లో భూమి కంపించింది. నవంబర్ 9న నేపాల్‌లో 6.3 తీవ్రతతో భూకంపం వచ్చిన విషయం తెలిసిందే. దీని ప్రభావంతో ఢిల్లీ, రాజధాని ప్రాంతం, ఉత్తరాఖండ్‌లో కూడా భూమి కంపించింది. రెండు రోజుల తర్వాత మరోసారి ఢిల్లీలో భూకంపం వచ్చింది.