Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : బండ్లగూడ, పోచారంలోని రాజీవ్ స్వగృహ ఫ్లాట్ల కేటాయింపు డ్రాను ఈనెల 15న నిర్వహించనున్నట్లు హెచ్‌ఎండీఏ అధికారులు తెలిపారు. రాజీవ్ స్వగృహలోని 3 బీహెచ్‌కే డీలక్స్, 3 బీహెచ్‌కే, 2 బీహెచ్‌కే, 1 బీహెచ్‌కే ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులకు లాటరీ పద్ధతిన ఫ్లాట్లను కేటాయిస్తామన్నారు. కలెక్టర్ ఆధ్వర్యంలో పారదర్శకంగా నిర్వహించే ఈ కార్యక్రమాన్ని ఫేస్‌బుక్, యూట్యూబ్‌ల ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేస్తామని తెలిపారు.