Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : దేశంలో తొలిసారిగా హైదరాబాద్ కేంద్రంలో ప్రైవేట్ సంస్థ రూపొందించిన స్కైరూట్ ఏరోస్పేస్ తొలి మిషన్‌ను నవంబర్ 18న ప్రారంభించనున్నారు. ప్రతికూల వాతావరణం కారణంగా రాకెట్‌ను 3 రోజులు ఆలస్యం చేసినట్లు తెలిపారు. మొట్టమొదటి ప్రైవేట్‌గా అభివృద్ధి చేసిన రాకెట్ విక్రమ్-ఎస్- ఉపకక్ష్య ప్రయోగాన్ని నవంబర్ 18న ప్రయోగించనున్నట్లు హైదరాబాద్‌కు చెందిన స్పేస్ స్టార్టప్ స్కైరూట్ ఏరోస్పేస్ ఆదివారం తెలిపింది. ప్రతికూల వాతావరణ సూచన కారణంగా, శ్రీ హరికోట నుండి మా విక్రమ్-ఎస్ రాకెట్ ప్రయోగాన్ని నవంబర్ 15 నుండి 19 నుండి ప్రయోగించేందుకు అవకాశం ఏర్పడినట్లు నవంబరు 18 ఉదయం 11:30 గంటలకు జరిగే అవకాశం ఉందనిు అని స్కైరూట్ ఏరోస్పేస్ ప్రతినిధి తెలిపారు.
స్కైరూట్ ఏరోస్పేస్ యొక్క తొలి మిషన్, 'ప్రారంభ్'(ప్రారంభం) అని పేరు పెట్టామన్నారు. శ్రీ హరికోటలోని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ యొక్క లాంచ్‌ప్యాడ్ నుండి ప్రయోగానికి సిద్ధంగా ఉందన్నారు. ఈ మిషన్ స్కైరూట్‌కు ఒక ముఖ్యమైన మైలురాయిగా పరిగణించబడుతుందన్నారు. ఎందుకంటే ఇది వచ్చే ఏడాది ప్రారంభించేందుకు ప్రణాళిక చేయబడిన విక్రమ్1 ఆర్బిటల్ వాహనంలో ఉపయోగించే 80 శాతం సాంకేతికతలను ధృవీకరించడంలో సహాయపడుతుందన్నారు.