Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి పూర్తిగా అదుపులోనే ఉంది. రోజురోజుకూ కొత్త కేసులు గణనీయంగా తగ్గుముఖం పడుతున్నాయి. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 547 కొత్త కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. కాగా, 2020 ఏప్రిల్ తర్వాత ఇంత తక్కువ సంఖ్యలో కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. తాజా కేసులతో దేశంలో వైరస్ బారిన పడిన వారి సంఖ్య 4,46,66,924కి చేరింది. ప్రస్తుతం దేశంలో 9,496 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇక ఇప్పటి వరకు 4,41,26,924 మంది కరోనా మహమ్మారి నుంచి కోలుకున్నారు. గత 24 గంటల్లో వైరస్ కారణంగా ఒకరు మృతి చెందగా.. మొత్తం మరణాల సంఖ్య 5,30,532కి చేరినట్లు వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఇక మొత్తం కేసుల్లో 0.02 శాతం కేసులు యాక్టివ్‌గా ఉన్నాయని, రికవరీ రేటు 98.79 శాతం, మరణాలు 1.19 శాతంగా ఉన్నాయని తెలిపింది. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 219.80 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేసినట్లు వెల్లడించింది.