Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: గతనెల టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ ఓరి దేవుడా సినిమాను రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. గతేడాది పాగల్ వంటి డిజాస్టర్ తర్వాత ఈ ఏడాది అశోక వనంలో అర్జున కళ్యాణం వంటి బ్లాక్‌బస్టర్‌తో విశ్వక్‌కు మంచి శుభారంభం దక్కింది. అదే తరుణంలో ఓరి దేవుడా సినిమా మొదటి రోజు నుండి పాజిటీవ్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లను సాధించింది. ఈ మూవీ తమిళంలో సూపర్ హిట్టయిన ఓమై కడువలే చిత్రానికి రీమేక్‌గా తెరకెక్కింది. ఒరిజినల్ వెర్షన్‌ను తెరకెక్కించిన అశ్వత్ మారిముత్తూ రీమేక్ సినిమాను కూడా తెరకెక్కించాడు. వెంకటేష్ కీలకపాత్రలో నటించిన ఈ చిత్రం ఇటీవలే ఆహాలో రిలీజైంది. ఓరి దేవుడా మూవీ ఓటీటీలోనూ ప్రేక్షకుల మన్నలను పోందుతుంది. తాజాగా ఈ చిత్రం ఆహాలో కేవలం 40 గంటల్లో 100 మిలియన్ల స్ట్రీమింగ్ మినట్స్‌ను సొంతం చేసుకుని ఇంత వేగంగా ఈ ఘనత సాధించిన సినిమాగా ఆహాలో సరికొత్త రికార్డు క్రియేట్ చేసుకుంది. రోమ్-కామ్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని పీవిపీ సినిమాస్, శ్రీ వెంకటేశ్వరా క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మించాయి. విశ్వక్‌కు జోడీగా మిథిలా పాల్కర్, ఆశా భట్‌లు ఈ చిత్రంలో నటించారు. పూరి జగన్నాధ్ గెస్ట్ రోల్ పోషించిన ఈ సినిమాకు లియోన్ జేమ్స్ సంగీతం అందించాడు.